Monday, April 29, 2024

Congress – అమ్మ… నేను మీ బిడ్డనే..నన్ను ఆశీర్వదించండి – నీలం మధు

.అమ్మ నేను మీ బిడ్డనే.. నన్ను ఆశీర్వదించండి.. మెదక్ పార్లమెంటు లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నా తనకు మద్దతు ఇవ్వండి అంటూ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి కాట భారతమ్మ కు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఆదివారం అశోక్ నగర్ లోని కాట శ్రీనివాస్ గౌడ్ నివాసానికి వెళ్లిన నీలం మధు ఆ సమయంలో కాట అందుబాటులో లేకపోవడంతో కాట తల్లి భారతమ్మ ను కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం తనకు టిక్కెట్ కేటాయించిందన్నారు. ఇందిరా గాంధీ లాంటి మహానేత ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు లో ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి సోనియా గాంధీ గారికి బహుమానంగా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు.

ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ రామ లక్ష్మణుల వలె కలిసి ముందుకు సాగుతామన్నారు. తనను సైతం మీ ఇంట్లో బిడ్డగా భావించి ఈ ఎన్నికల్లో తనకు పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.మెదక్ ఎంపీగా నీలం మధు విజయం సాధించాలని ఆమె ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement