Friday, May 17, 2024

GT vs SRH | త‌క్కువ ప‌రుగుల‌కే స‌న్‌రైజర్స్‌ను కట్టడి చేసిన గుజరాత్

ఐపీఎల్ సీజన్‌లో భాగంగా.. హోం గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ను స్వల్ప పరుగులకే పరిమితం చేసింది గుజరాత్ టైటాన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్… దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే పదో ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోవడంతో జోరు తగ్గింది. మయాంక్ అగర్వాల్ (16), ట్రావిస్ హెడ్ (19), అభిషేక్ శర్మ (29), ఐడెన్ మార్క్రమ్ (17), హెన్రిచ్ క్లాసెన్ (24), షాబాజ్ అహ్మద్ (22), అబ్దుల్ సమద్ (29) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు.

గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. కాగా, గుజరాత్ జట్టు 163 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement