Sunday, April 28, 2024

ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండ: ఎమ్మెల్యే సీతక్క

317 జీవో విషయంలో ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. 317 జీవోను రద్దు చేయాలని కోరతూ తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులను ఎమ్మెల్యే సీతక్కను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. ప్రభుత్వం 317 జోవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

371(D) అధికరణకు లోబడి 1975లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు జోన్లు ఏర్పాటు చేశారన్నారు. ఆయా జోన్ల వారీగా విద్య, ఉద్యోగాల్లో 80% స్థానికులకు 20%  స్థానికేతరులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ, నేటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 371(డి) అధికరణ అమలులో ఉందన్నారు. 317 జోవోతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేక పెడదారి పట్టే అవకాశాలున్నాయని చెప్పారు.

అసమగ్రమైన ఈ 317 జీవో వలన ఉద్యోగ ఉపాద్యాయులు అనేకమంది భార్య ఓ చోట భర్త మరో చోటకు కేటాయించపడ్డారని తెలిపారు. ఇప్పటికే 12 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చనిపోయారని పేర్కొన్నారు. 317 జీవోను తక్షణమే రద్దు చేసి 371(డి) ఆర్టికల్ కు లోబడి స్థానికత ఆధారంగా జిల్లా,జోనల్,మల్టి జోనల్ వ్యవస్థ కేటాయింపులను రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి,వారి కుటుంబంలో ఒకరికి తక్షణమే కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement