Thursday, May 16, 2024

కరీంనగర్ లో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వం శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. అస్సాం సీఎం హేమంత్ శర్మ అరెస్ట్ చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నాకు బయల్దేరిన కాంగ్రెస్ నేతలను ముందస్తుగా కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొండ హరీష్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement