Sunday, April 28, 2024

దండోరాతో దడ.. రేవంత్ బాష కేసీఆర్ దే

దళిత దండోరా సభపై మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టింది. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత, గిరిజన దండోరా సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో దడ పుట్టిందని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి అన్నారు. దళిత గిరిజన దండోరాతో కలుగులో ఉన్న నాయకులంతా బయటకు వచ్చి అరుస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన బాష కొత్తగా వచ్చింది కాదని.. గత కొన్నేళ్లుగా కేసీఆర్ మాట్లాడిన బాషనే అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మూల సూత్రం తప్పులు జరిగితే క్షమాపణ కోరడమని.. అది తాము ఎప్పుడో చేశామన్నారు. మంత్రులు రేవంత్ రెడ్డిపైన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకొని టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దళిత, గిరిజనుల కోసం కాంగ్రెస్ పోరాటం ఆగదని మల్లు రవి స్పష్టం చేశారు. ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో దళిత, గిరిజన రెండో సభ నిర్వహించనున్నామని మల్లు రవి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement