Wednesday, May 1, 2024

హుజూరాబాద్ లో ఎగిరేది గులాబీ జెండానే – ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

ఇల్లందకుంట: కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా హుజురాబాద్ నియోజకవర్గంలో లక్ష 15 వేల ఎకరాలకు మూడు పంటలకు సరిపడా నీళ్లను అందుతున్నాయని, రైతు నినాదం మొదలుపెట్టింది కేసీఆరేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కరెంటు కుట్రలపై, బిఆర్ఎస్ పార్టీ మూడు పంటల నినాదంపై మండల కేంద్రంలోని రైతు వేదికలో క్లస్టర్ పరిధిలోని శ్రీరాములపల్లి, టేకుర్తి, గడ్డివానిపల్లి, ఇల్లందకుంట గ్రామాల రైతులతో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రైతు సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతుల కష్టాలు, రైతుల బాధలు తెలియని రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలనడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వాల కంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే రైతుల బాధలు కష్టాలు తీరాయని, మూడు పంటలు సరిపడా నీరునందిస్తు 24 గంటల కరెంటు అందిస్తుందన్నారు. రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు ఇలా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కెసిఆర్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందన్నారు 34 వేల మోటార్ల కనెక్షన్లు ఉంటే 800 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చింది, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా హుజురాబాద్ నియోజకవర్గం లో లక్ష 15 వేల ఎకరాలకు నీరందించడం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు.

ఎలక్షన్ల కోసం మాయమాటలు మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలకు మోసపోవద్దన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిల్లర మల్లర మాటలు మాట్లాడి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని కార్యకర్తలు గమనించి బి ఆర్ఎస్ పార్టీని గెలుపు దిశగా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వేలో హుజురాబాద్ లో గెలిచేది బీ ఆర్ పార్టీయేనని, ఇక్కడ ఎగిరేది గులాబీ జెండాయేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement