Friday, May 3, 2024

రుణమాఫీ రైతులకు రుణాలు ఇవ్వడంలో జాప్యం చేస్తే చర్యలు – బ్యాంకర్లకు కలెక్టర్ వార్నింగ్

వనపర్తి కలెక్టరేట్,సెప్టెంబర్21(ప్రభ న్యూస్)రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయడం ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతు తిరిగి కొత్తగా పంట రుణాలు పొందేందుకు అర్హత కలిగి ఉన్నాడని వెంటనే రైతులకు రుణాలు అందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ బ్యాంకు అధికారులను కోరారు,వనపర్తి జిల్లా కేంద్రంలో ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకును ఆయన ఆకస్మికంగా సందర్శించారు,బ్యాంకు మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్లతో పంట రుణాలకు సంబంధించిన మొత్తం రైతుల వివరాలు మాఫీ కాబడిన రైతుల జాబితాను పరిశీలించారు రెన్యువల్ చేయబడిన పంట రుణాల వివరాల పై సమీక్షించారు ,వనపర్తి అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంకులో 1269 ఖాతాలలో 9 కోట్ల 86 లక్షల రూపాయలు రుణమాఫీ కింద బ్యాంకుకు అందాయని వీటిలో 899 మంది రైతుల ఖాతాలను రెన్యువల్ చేశామని ఎనిమిది కోట్ల రూపాయల ను కొత్త పంట రుణాలుగా అందించామని బ్యాంక్ అధికారులు తెలిపారు,

పంట రుణం మాఫీ ద్వారా రుణం పూర్తిగా చెల్లించబడిన వారికి కొత్త రుణాలు ఇవ్వడంలో జాప్యం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు, కొత్త రుణాలు పొందవలసిన వారి జాబితాను పరిశీలించి వెంటనే రుణాలు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు, పంట రుణాలు మాఫీ అయిన తర్వాత రైతుల అకౌంట్లు వినియోగంలో లేకపోవడం ఆధార్ అనుసంధానం కాకుండా ఉండటం వల్ల రుణమాఫీ కానీ ఖాతాలను పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్లను ఆదేశించారు, ఈ కార్యక్రమంలో ఎల్.డి.యం అమోల్ పవర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement