Saturday, December 9, 2023

Honda | హార్నెట్‌2.0, డియో 125 ఎడిషన్ లాంచ్..

హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా మార్కెట్‌లో హోర్నెట్‌ 2.0, డియో 125 2023 రెప్పోల్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. హార్నెట్‌ 2.0 ధరను 1,40,000 రూపాయలుగా, డియో 125 ధరను 92,000గా కంపెనీ తెలిపింది. ఈ రెండు మోడల్స్‌ దేశవ్యాప్తంగా ఉన్న హోండా రెడ్‌ వింగ్‌ డీలర్‌షిప్‌లో లభిస్తాయని కంపెనీ తెలిపింది. మోటార్‌ సైకిల్‌ రేసింగ్‌కు పరాకాష్ట మోటోజీపీ అని, మన దేశంలో మొదటిసారి జరుగుతుందని, భారత అభిమానుల ఉత్సావాన్ని మరింత పెంచేందుకు హార్నెట్‌ 2.0, డియో 125 రెప్పోల్‌ ఎడిషన్‌ను లాంచ్‌ చేసినట్లు హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రెసిడెంట్‌, ఈసీఓ సుట్సుము ఓటాని తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement