Thursday, May 16, 2024

భువనగిరిలో ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు యదాద్రిభువనాగిరిలో ఘనంగా జరుగుతున్నాయి. TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు మూడు రోజులపాటు జన్మదిన వేడుకలలో భాగంగా బుధవారం భువనగిరి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహనీయులు కేసీఆర్‌ అన్నారు.  నిరుపేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తూ పేద జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు కిష్టయ్య, పరమేశ్వర రెడ్డి, భగత్, పాండు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement