Wednesday, May 1, 2024

సీఎం కాన్వాయ్ సెక్యూరిటీ అధికారినికి – తప్పిన పెను ప్రమాదం

జనగామ ప్రభ న్యూస్ – సీఎం కేసీఆర్ వరంగల్ వెళుతున్న సందర్భంగా సీఎం కాన్వాయ్ నుండి మహిళా సెక్యూరిటీ అధికారి పెంబర్తి కళాతోరణం వద్ద జారిపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన ఉండడంతో స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ .. ఎమ్మెల్యేలు కెసిఆర్ కి స్వాగతం పలికేందుకు పెంబర్తి కళాతోరణం వద్దకు వెళ్లి స్వాగతం పలికారు.. అనంతరం సీఎం కాన్వాయ్ వెళ్తున్న సందర్భంలోనే సీఎం కాన్వాయ్ మహిళ సెక్యూరిటీ అధికారిని జారిపడింది.అయితే కాన్వాయ్ మాత్రం ముందుకు వెళ్లింది. వెంటనే సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమై ఆమెను కాపాడారు.దీంతో పెను ప్రమాదం తప్పిందని మహిళ సెక్యూరిటీ అధికారినికి స్వల్ప గాయాలైనట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement