Sunday, April 28, 2024

TS: కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ రేవంత్‌ రెడ్డికి మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాభినందనలు. మీ నేతృత్వంలో ఇకపై రాష్ట్రం మరింతగా అభివృద్ధి పథంలో సాగాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. డిప్యూటీ సీఎంగా నియమితులైన భట్టి విక్రమార్కకు, ఇతర మంత్రులందరికీ శుభాకాంక్షలు’ అని చిరంజీవి ట్వీట్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement