Monday, April 29, 2024

Changes Start .. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివ‌ధ‌ర్‌రెడ్డి ..సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీగా శేషాద్రిల నియామకం

హైద‌రాబాద్ – తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి. శివ‌ధ‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు. సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా శేషాద్రిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత ఈ ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే మ‌రికొంత మంది అధికారుల‌ను రేవంత్ మార్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ రెండో సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. రెండు ద‌స్త్రాల‌పై సంత‌కాలు చేశారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్ర‌కారం ఆరు గ్యారెంటీల ద‌స్త్రంపైనే ఆయ‌న తొలి సంత‌కం చేశారు. ఆ త‌ర్వాత దివ్యాంగురాలు ర‌జినీకి ఉద్యోగ నియామ‌క ఉత్త‌ర్వుల‌పై రెండో సంత‌కం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement