Friday, May 17, 2024

బాల‌ల హ‌క్కుల‌కు భ‌రోసా ఇవ్వాలి

బాలల హక్కుల పై విస్తృతంగా ప్రచారం చేయడం తో పాటు వారి హక్కులకు భరోసా ఇవ్వాలి అని కలెక్టర్ శివ లింగయ్య అన్నారు. బుధవారం రాత్రి బాలల హ‌క్కుల వారోత్సవాల సంద‌ర్భంగా జనగామ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిరక్షణ విభాగం , చైల్డ్ లైన్ 1098 రూపొందించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ బాలల హక్కులను ఎప్పుడూ గౌరవిస్తూ ,వారిని కాపాడతామని, బాలల అందరూ బడి లొనే ఉండాలని, బాల కార్మికులు గా మారకూడదన్నారు.

బాల్యవివాహాలు జరగకుండా, వారిపై వేధింపులు లేకుండా బాలల హక్కుల గురించి, పిల్లలకు ఏదైనా ఆపదవస్తే బాలల నేస్తం 1098 గురించి అందరికి అవగాహన కల్పించాలని కోరారు. బాలల స్నేహపూరిత జనగామ జిల్లా గా మార్చడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి జయంతి ,జిల్లా సంక్షేమ సమితి ఛైర్పర్సన్ ఉప్పలయ్య , సభ్యులు కవిత ,సుజాత ,జిల్లా బాలల సంరక్షణ అధికారి రవికాంత్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఇక్బాల్ పాషా, జిల్లా పరిరక్షణ విభాగం సిబ్బంది,అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement