Saturday, May 4, 2024

పాత బస్తీలో కంత్రీ బాబా

పాతబస్తీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రీట్మెంట్ నెపంతో నవ వధువుపై నకిలీ బాబా లైంగిక దాడికి పాల్పడ్డాడు.

హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బండ్లగూడ ప్రాంతంలోని బజార్ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు.నవ వధువు కళ్లకు గంతలు కట్టి గదిలో బంధించిన బాబా.. అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. విషయం బయటికి పొక్కడంతో నకిలీ బాబా పరారయ్యాడు.

అత్తమామలకు విషయం చెప్పినా స్పందన లేకపోగా, ఆమెకు దయ్యం పట్టిందని ఇంట్లో బంధించారు.తల్లిదండ్రుల సహాయంతో భవాని నగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నకిలీ బాబా కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement