Sunday, April 28, 2024

MBNR: అభ్యర్థిని మార్చండి..అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంకు నేతల గట్టి షాక్

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు బయటకు వస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో తమకు నచ్చని అభ్యర్థిపై విమర్శలు చేస్తూ పలువురు నేతలు, కార్యకర్తలు బయటకు వస్తున్నారు. అభ్యర్థిని మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అలంపూర్ ఎమ్మెల్యే మాకు వద్దంటూ ఆపార్టీ నేతలే ఎర్రవల్లి మండలం బీచుపల్లి దగ్గర అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. అలంపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అబ్రహంను మార్చాలంటూ వంద వాహనాలలో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటలకు ఏక వాక్య తీర్మానంతో మంత్రి కేటీఆర్ ను కలవనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement