Thursday, May 2, 2024

MDK: మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పట్లోళ్ల శశిధర్ రెడ్డి

మెదక్ : జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన .. అనంతరం మాట్లాడారు. మెదక్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమ‌ని, ఈ సారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అన్నారు. డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ కొనలేరన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగలాగా చేసి చూపించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు.

కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కరువులు, కర్ఫ్యూలు అని చెప్పారు. తెలంగాణలో మూడు గంటల కరెంట్ చాలు అన్నోళ్లు ఓ దిక్కున్నారు…మూడు పంటలు పండాలన్న సీఎం కేసీఆర్ మరో దిక్కున్నారని వెల్లడించారు మంత్రి హరీష్ రావు. ఎవరిని గెలిపించాలో మీరే నిర్ణయించుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement