Thursday, May 9, 2024

సీసీ కెమెరాల నిఘాలో పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా కేంద్రం సీసీ కెమెరాల నిఘాలో ఉందని సిఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని కోడళ్ళ తోపాటు కాలనీల్లో ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యాపారులు తమ దుకాణాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కాలనీలలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పెద్దఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో పలు కేసుల దర్యాప్తు సమయంలో ఉపయోగ పడే విధంగా రాజీవ్ రహదారిపై హై క్వాలిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాల నంబర్ లు తెలిసే విధంగా హై జూమ్ కెమెరాలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి నిత్యం పోలీస్ స్టేషన్ లోని సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నామని సిఐ ప్రదీప్, ఎస్ఐ రాజేష్ లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement