Sunday, April 28, 2024

HCA : మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు న‌మోదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు నమోదయ్యింది. హెచ్ సీఏలో అవకతవకలు జరిగాయంటూ ఉప్పల్ పీఎస్ లో ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు నియమించిన లావు నాగేశ్వరరావు కమిటీ ఫిర్యాదు చేసింది.

నిధుల గోల్ మాల్, సామాగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయని రిపోర్టు ఇచ్చారు. జిమ్ ఎక్విప్ మెంట్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్ మెంట్, క్రికెట్ బాల్స్, చైర్స్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు. కొనుగోలు కమిటీలో ఉన్న అజారుద్దీన్, మనోజ్, విజయానంద్ పై కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement