Wednesday, November 29, 2023

Crime: మహిళ దారుణహత్య.. గొంతు కోసి, కాళ్లు నరికి ఆపై..

ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుండగులు మహిళ గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలిని గజ్వేల్‌ ఏసీపీ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
   

దారుణ హత్యకు గురైన మహిళను వెంకటమ్మ (40) గా గుర్తించారు. వెంకటమ్మ ప్లాస్టిక్‌ సామాగ్రి అమ్ముతూ జీవనం కొనసాగిస్తుండగా.. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకటమ్మ భర్త గతంలో మృతిచెందారు. కాగా, వెంకటమ్మను హత్య చేసిందెవరు ? హత్యకు గల కారణాలేంటి ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement