Sunday, September 29, 2024

BRS +MIM మ‌జ్లీస్ దోస్తీతో కారు ప‌రుగులు…..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీల దోస్తి భారాస అభ్య ర్థుల గెలుపునకు దోహదపడనున్నది. మజ్లిస్‌ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న భారాసకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ పార్టీల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో భారాసకు సంపూర్ణ మద్దతునిచ్చేందుకు మజ్లిస్‌ పార్టీ సిద్ధపడింది. దీంతో జరగ నున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్త్తం గా పోటీ చేస్తున్న భారాస అభ్య ర్థుల గెలుపుకు సహకరించాల ని ఎంఐఎం అధినేత ఒవైసీ ముస్లిం మైనారిటీ ఓటర్లను కోరినట్లు బహిరంగంగా ప్రచా రం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మజ్లిస్‌ యంత్రాంగం ఆయా జిల్లాల్లో మిత్రపక్షానికి మద్ధతుగా క్రియాశీలకంగా పనిచేస్తుందని సమాచారం. అయితే మైనారిటీ ల్లో చాలా మంది ఓటర్లు మాత్రం కాంగ్రెస్‌ వైపుకు చూపుతున్నట్లు సర్వత్రా వినిపిస్తుంది. అంతేకాకుండా మరోవైపు భాజపాకు వ్యతి రేకంగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని ముస్లిం మైనారిటీలు నిర్ణయించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ప్రస్తుతం పాతబస్తీలోని 7 నియోజకవర్గాలైన చాంద్రా యణగుట్ట, మలక్‌పేట్‌, నాంపల్లి, కార్వాన్‌, చార్మినార్‌, యూఖుత్‌పురా, బహదూర్‌ పురాలు మజ్లిస్‌ గుప్పిట్లో ఉన్నాయి. పార్టీని పాతబస్తీకే పరిమితం చేయకుండా, రాష్ట్ర స్థాయిలో సంస్థాగతంగా విస్తరించేందుకు వ్యూహాన్ని రచించిన మజ్లిస్‌ అధిష్టానం జరగనున్న ఎన్నికల్లో కనీసం 20 వేల వరకు ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉన్న నియోజక వర్గాల్లో పోటీ చేయాలని అప్పట్లో సంకల్పిం చింది. ఇందులో భాగంగా ముస్లిం ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న హైదరాబాద్‌ నగరంతో పాటు వివిధ జిల్లాలకు చెందిన నియోజక వర్గాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దించొచ్చన్న ఎంఐఎం ముషీరాబాద్‌, అంబర్‌ పేట్‌, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌, జూబ్లిd హిల్స్‌, గోషామహల్‌, రాజేంద్రనగర్‌, ఎల్బీ నగర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, కామారెడ్డి, బోధన్‌, గద్వాల, మహ బూబ్‌నగర్‌, జహీరాబాద్‌, ముధోల్‌, నిర్మల్‌, అదిలాబాద్‌ తదితర నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
ఈ మేరకు మజ్లిస్‌ పార్టీ చేసిన ప్రకటనతో, ముస్లిం మైనారిటీ ఓటర్ల ఆధిక్యత గల స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న మిత్రపక్ష భారాసకు చెందిన అభ్యర్థుల్లో కొంత వరకు ఆందోళన కలిగించినా, ఒవైసీ మనస్సు మార్చుకుని ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయడంలేదని ప్రకటించడం జరిగింది. కాగా నగరంలో తమ ఆధీనంలో ఉన్న నియోజక వర్గాలు తప్పా, వేరే చోట పోటీకి ఆసక్తి చూపని ఎంఐఎం కేసీఆర్‌కు ఇచ్చిన హామీ మేరకు తాను ఊహించిన ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న భారాస అభ్యర్థుల విజయాలకై సర్వేలు చేపడు తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ మిత్రపక్షమైన భారాస అభ్యర్థుల గెలుపునకు ఆయా నియోజకవర్గాల్లోని ముస్లిం మైనారిటీ ఓటర్లందరు ఏకతాటిపై నిల్చొని ఓటు వేయాలని పలువురు స్థానిక ప్రముఖులకు సైతం సమా చారం అందించినట్లు తెలు స్తోంది. భారాసకు అనుకూ లంగా ఉన్నట్లు మజ్లిస్‌ పార్టీ సందేశాన్ని మైనారిటీ ఓటర్ల వరకు చేరవేసే విధంగా ఆయా జిల్లాల్లో ఉన్న కింది స్థాయి కార్యకర్తలకు బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం.
మజ్లిస్‌ అభ్యర్ధులు పోటీ చేయకున్నా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలపుకు పాటు పడాలని ఒవైసీ సూచనలు జారీ చేశారని తెలియడంతో భారాస వర్గాల్లో గెలుపు ఆశలు పుట్టుకొస్తు న్నాయి. అయితే నగరంలోని జూబ్లిdహిల్స్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నా, భారాస అభ్యర్థుల గెలుపుకే దోహదపడతాయనే ప్రచారం జరుగు తుంది. అయితే ఎన్నికల్లో విజయం సాధించే సత్తా గలఅభ్యర్థులకే మద్దతు పలికేందుకు మైనారిటీ ఓటర్లు చూస్తున్నట్లు సమాచారం. ఆధునిక ప్రజాస్వామ్యవాదులు మాత్రం చివరి క్షణం వరకు వేచి ఉంటూ, అధికార సాధనలో ఏ రాజకీయ పార్టీ ముందంజలో ఉంటుందో వారి పక్షమే ఉండాలనుకుంటున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో మజ్లిస్‌ సహకారంతో భారా స అభ్యర్థులు గట్టెక్కే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement