Wednesday, May 15, 2024

BRS campaign – రిస్క్ వద్దు..కారు ముద్దు..కాంగ్రెస్ వస్తే కటిక చీకటే – హరీష్ రావు

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రికాంగ్రెస్ కు ఓటేస్తే రాష్ట్రం కటిక చీకటి కానున్నదని, కాంగ్రెస్ కావాలో, 24 గంటల ఉచిత కరంట్ కావాలో తేల్చుకోవాలని ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావ్ అన్నారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లాలోని భువనగిరి, చికటిమామిడి లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లు అభివృద్ధి నిరోధకులని, అధికారం లోకి వస్తే 5 గంటలు కరంట్ ఇస్తాం అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇప్పుడుకాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడిందని, రైతుల సంక్షేమం ఏనాడు కూడా పట్టించుకోలేదన్నారు.కరంట్ కావాలంటే బీఆర్ఎస్ కి ఓటయ్యాలని చెప్పారు. కాంగ్రెస్ వస్తే కటిక చీకట్లే వస్తాయన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు, రైతుబీమా, కరంట్ తీసివేస్తారని, ఎరువుల కొరత మళ్ళీ, తాగునీటి కష్టాలు మళ్ళీ మొదలవుతాయని,అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలన్నారు..

కారు, కేసీఆర్ తోటే 24 గంటల కరంట్ వస్తుందని చెప్పారు. రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసిందని, నేడు హైకోర్టు తీర్పు రైతుల పక్షాన ఇవ్వడంతోమంగళవారం నుండి రైతు బంధు డబ్బులు అన్నదాతలు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. మొండి హస్తానికి ఓటేస్తే రిస్క్ లో పడతామని,కాంగ్రెస్ వాళ్ళది సుతి లేని సంసారం అని చెబుతూ వాళ్లకు వల్లే తన్నుకు చస్తున్నారన్నారు. ఇక్కడికాంగ్రెస్ వాళ్లు ఢిల్లీకి గులాం లుకేసీఆర్ కు తెలంగాణ ప్రజలే హై కమాండ్ అని చెప్పారు. మూడోవసారి అధికారంలోకి రాగానే భువనగిరి లో హబ్ నిర్మిస్తామని చెప్పారు.

ఆలేరు లో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని అన్నారు. పుట్టిన తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే సురక్షితమన్నారు. కార్యకర్తకు ఆపద వస్తే కంటికి రెప్పలా కాపాడుకుంటానని చేప్పారు. కాంగ్రెస్ కు చాన్స్ ఇస్తే రాష్ట్రం కుక్కలు చింపిన ఇస్తరిలా మారుతుందని, ఆరు గ్యారంటీలకు బదులు ఆరుగురు సీఎం లు మారుతారని అన్నారు.సాగు, తాగు జలాలను అందించిన ఘనత కేసీఆర్ ది అని చెప్పారు.బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే సన్నబియ్యం ఇస్తామని,మహిళలకు సౌభాగ్య లక్ష్మీ కింద మూడు వేలు, రూ. 4వందల కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు.

- Advertisement -

ఆలేరు, భువనగిరిలో ఎగిరేది గులాబీ జెండే నన్నారు.ఫైళ్ల శేఖర్ రెడ్డి మంచి మనిషి,సాయం చేసే వ్యక్తి, కపటం, కల్మషం లేని వ్యక్తి అని అన్నారు. ముచ్చటగా మూడోసారి శేఖర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధిస్తారని, ప్రమోషన్ తో భువనగిరి గౌరవం పెంచుతారన్నారు. 80 సీట్లతో బీఆర్ఎస్ మూడోసారి అధికారం లోకి రానున్నదని, హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ చరిత్రలో నిలుస్తాడన్నారు. సునీతా రెడ్డి, శేఖర్ రెడ్డిలను భారీ మెజారిటీ తో గెలిపించే బాధ్యత మీదేనన్నారు.

ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి, బూడిద బిక్షమయ్య గౌడ్, ఎలిమినేటి సందీప్ రెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, కల్లూరి రాంచంద్రా రెడ్డి, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్ లో భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.———?

Advertisement

తాజా వార్తలు

Advertisement