Monday, April 29, 2024

తాండూరులో “బ్రోకెన్ హార్ట్ ” సినిమా షూటింగ్ ..

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల ఐబి కేంద్రంలో సోమవారం “బ్రోకెన్ హార్ట్ ” అనే సినిమా షూటింగ్ జరిగింది. ఏకారి ఫిలిమ్స్ బ్యానర్ పై ఏకారి సత్యనారాయణ నిర్మాతగా, భాస్కర్ దర్శకత్వ పర్యవేక్షణలో పలువురు నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. గత 15 రోజులుగా మంచిర్యాల పరిసర ప్రాంతాలు, తాండూర్ ఐబి అటవీ ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ జరుగుతోందని స్థానిక నటీనటులకు అవకాశం కల్పించామని చిత్ర నిర్మాత సత్యనారాయణ తెలిపారు.

ఐబి మండల కేంద్రంలో దసరా ఫిలిం గడ్డం సురేష్, కుట్ర ఫిలిం ఫేమ్ రాజేష్ లు ఓ అమ్మాయిని రక్షించే సన్నివేశాలను చిత్రీకరించామని ఆయన తెలిపారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని మిగిలిన సన్నివేశాలను కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామనీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement