Friday, May 17, 2024

Breaking : బీజేపీ నేత‌ల హౌస్ అరెస్టు

జ‌న‌గామ‌లో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ వార్ కొన‌సాగుతోంది. అందులో భాగంగా ఇవాళ బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పలువురు ముఖ్యనేతలను అరెస్ట్ చేశారు. రాత్రి నుంచి బీజేపీ నేతల ఇంటి ముందు పోలీస్ పహారా కాస్తున్నారు. నిన్న జనగామాలో బీజేపీ- టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని పరామర్శించడానికి వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement