Thursday, April 25, 2024

గులాబీలు జ‌నం బాట‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల వ్యవధి మాత్రమే ఉండడంతో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి(భారాస) మరోసారి పాగా వేసేందుకు చకచకా పావులు కదుపుతూ దూసుకుపోతోంది. ఒక
వైపు ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారు పన్నుతున్న వ్యూహాలకు చెక్‌ పెడుతూ ముందుకు సాగుతోంది. మరోవైపు కొత్త పథకాలు, కార్యక్రమాలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు భారాస కార్యాచరణ రూపొందించే పనిలో పడింది. గురువారం ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా సాగిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌ శుక్రవారం రాజధాని నగరం హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరుతో నిర్మించిన కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ సచివాలయాన్ని ఏప్రిల్‌ 30న ప్రారంభించా లన్న ముహుర్తాన్ని ఖరారు చేశారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆయన జన్మదినం ఏప్రిల్‌ 14న ఆవిష్కరించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్‌ 2న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. శుక్రవారం కేసీఆర్‌ నూతన సచివాలయ పనుల్లో జరుగుతున్న పురోగతితో పాటు- అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం పనులను పర్యవేక్షించారు. చట్టసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి అమలు చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఒక రోజు దీక్ష ఒకవైపు, మరోవైపు తెలంగాణ భవన్‌లో భారాస విస్తృతస్థాయి సమావేశంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడిని రగిల్చాయి. ఐదారు రోజులుగా తెలంగాణాలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే భారాస పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లినట్టు- రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటు-న్నారు. ఎన్నికలకు 8 మాసాల ముందే రాజకీయ వేడి ఇంతలా ఉంటే ఇక మున్ముందు పరిస్థితి మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉంటు-ందన్న ప్రచారం జరుగుతోంది.

అన్ని వర్గాలను ఆకర్షించేలా నిర్ణయాలు
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను మరింత ఆకర్షించేలా వారిని అక్కున చేర్చుకునేలా మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు- రాజకీయ పండితులు చెబుతున్నారు. దళిత బంధుతో ఈ సామాజిక వర్గం నిరుద్యోగులను ఆకర్షించేందుకు భారీ ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు ఎంతోగానో లాభిస్తుందన్న ధీమాతో పార్టీ వర్గాలున్నాయి. బ్యాంకుతో సం బంధం లేకుండా లబ్ధిదారుని ఖాతాలో రూ.10 లక్షలు ప్రభుత్వం జమ చేయనుంది. సొంత స్థలం ఉన్న వారికి సొంతిల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు ఇచ్చేందుకు మంత్రిమండలి తీర్మానించడం శుభపరిణామమని, గృహలక్ష్మి పేరుతో మొదలు పెట్టనున్న ఈ పథకం ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందేది బీసీలేనని, ఎన్నికల్లో వీరంతా తమ పార్టీని ఆదరించి అక్కున చేర్చుకుంటారన్న భారాస లెక్కలు వేసుకుంటోంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఈ మేరకు మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడంతో గిరిజన ఓటర్లు తమకు అండగా నిలబడతారని భారాస భావిస్తోంది. దీనికి తోడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కాశీ, శబరిమలకు వెళ్లే తెలంగాణ వాసులు బస చేసేందుకు వీలుగా రూ.25 కోట్లతో అతిథి గృహాలను నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా లబ్ధి పొందాలని భారాస భావిస్తోంది. హిందువులకు తామే ఛాంపియన్‌ అని, హిందువుల హక్కుల పరిరక్షణకు పోరాడే ఏ-కై-క పార్టీ భారాస అని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారానికి కాశీ, శబరిమలలో నిర్మిస్తున్న యాత్రికుల సముదాయాల అంశాన్ని వివరించి చెక్‌ పెట్టవచ్చన్న ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్టు- ప్రచారం జరుగుతోంది.

ఎన్నికలకు సన్నద్ధం
శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇక నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ఉండి ప్రజలతో మమేకం కావాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, ప్రగతి కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లి చెప్పాలన్నారు.

నేడు హైదరాబాద్‌కు అమిత్‌ షా
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శనివారం రాష్ట్రానికి వస్తుండడం ఇదే రోజున ఎమ్మెల్సీ కవిత లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ ఎదుట హాజరుకావడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణాలో అధికారం -కై-వసం చేసుకునే దిశగా అడుగు లు వేస్తున్న భాజపా ఎటు-వంటి వ్యూహం రచిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అమిత్‌ షా రాష్ట్ర నాయకత్వానికి ఎటు-వంటి ఆదేశాలిస్తారన్నది హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ చేపట్టిన జోడో యాత్రకు అనూహ్య స్పందన వస్తుండడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. భారాసను, సీఎం కేసీఆర్‌ను ప్రజలు విశ్వసించడం లేదని, 72 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేస్తామని పార్టీ చీఫ్‌ రేవంత్‌ ప్రకటించారు. మరోవైపు జోడో యాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ- చైర్మన్‌ మహేష్‌రెడ్డి, ఇతర నేతలు ఈ తరహా యాత్రలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement