Tuesday, May 7, 2024

ఇత్త‌డి కొప్పెర‌లో ఇరుక్కుపోయిన బాలుడు..

ఓ బుడ్డోడు ఇత్త‌డి కొప్పెర‌లో ఇరుక్కుపోయాడు.. తల వరకు కొప్పెరలోనే ఉండిపోయింది. బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో వెల్డింగ్ షాపుకు తీసుకెళ్లారు. చివరకు కొప్పెరను కట్ చేసి బాలుడిని బయటకు తీశారు. తల్లిదండ్రులు తమ పనిలో ఉండగా ఆ పక్కనే ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు కొప్పెరలో దిగాడు. తల భాగం మాత్రమే పైకి ఉంది. మిగతా శరీరం మొత్తం కొప్పెరలోనే ఉంది. బయటకు రావడం వీలుకాకపోవడంతో బాలుడు ఏడుపు అందుకున్నాడు. బాలుడిని కొప్పెరతో పాటూ వెల్డింగ్ షాపుకు తీసుకెళ్లగా.. అక్కడ గంట సేపు కష్టపడి కత్తెరను కట్ చేసి బాలుడిని బయటకు తీశారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఉపిరి పీల్చుకున్నారు. తర్వాత బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు బాలుడికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం మూడెత్తుల తండాలో చోటుచేసుకుందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement