Friday, May 3, 2024

Ponnam: బీఆర్ఎస్‌ను కాపాడేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం.. ప్రతిపక్షాలు ఆందోళన వ‌ద్దు.. మంత్రి పొన్నం

కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ జరిగితే బీఆర్ఎస్‌కు దడ పుడుతుంద‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదని విమర్శించారు. ప్రాజెక్టు డ్యామేజ్… అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ను కాపాడేందుకు బీజేపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి యత్నిస్తున్నాని ఆరోపించారు. కరీంనగర్‌లో బుధ‌వారం మార్నింగ్ వాక్‌లో పాల్గొన్న మంత్రి పొన్నం, మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడు అయితే తనపై వచ్చిన ఆరోపణపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడంలేదని ప్రశ్నించారు.

అక్ర‌మంగా ఉద్యోగాలు పొందిన వారు వ‌దిలేయాలి..
జెన్ కో లో అక్రమంగా ఉద్యోగం పొందిన మహిళతో వారికి సంబంధం లేకుంటే పోలీసులకు పిర్యాదు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కరీంనగర్‌కు ఏం చేయలేదని విమర్శించారు.‌ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు ఎంపీ బండి సంజయ్ వ్యవహరిస్తూ.. మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. జెన్ కో తోపాటు ఇతర డిపార్ట్మెంట్ లో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి పోవాలని సూచించారు. భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చి నెలరోజులు అవుతుందని, గ్యారెంటీ స్కీమ్ లపై ద‌రఖాస్తులు స్వీకరించగా కోటి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. చిత్తశుద్ధితో ఆరు గ్యారంటీ స్కీమ్ లను అమలు చేస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement