Monday, April 29, 2024

BREKING: నాంప‌ల్లిలో ప‌ట్టాలు త‌ప్పిన ఛార్మినార్ ఎక్స్ ప్రెస్‌.. అరుగురికి గాయాలు

నాంప‌ల్లి రైల్వేస్టేష‌న్‌లో ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురికి గాయాల‌య్యాయి. వెంట‌నే వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఓవ‌ర్ స్పీడ్ తోనే ప్ర‌మాదం ….
ఓవర్ స్పీడ్‌తోనే రైలు ప్రమాదం జరిగిందని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేష్ వెల్లడించారు. రైలు ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. చాలా మంది ప్యాసింజర్లు సికింద్రాబాద్‌లొనే దిగిపోయారని ,. రైలు ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలైనట్లు ఆయన స్పష్టం చేశారు. ఎవరికీ ప్రమాద తీవ్రత లేదని తెలిపారు. చాలామంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ప్రమాదంలో S2, S3, S6 బోగీలు పట్టాలు తప్పాయని పేర్కొన్నారు. గాయపడిన ఆరుగురు ప్యాసింజర్లను లాలగూడా రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా బోగీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలు దెబ్బతిన్నట్లు తెలిపారు. రైలు ప్రమాదం వల్ల ఇతర రైళ్లను రద్దు చేయలేదని, అన్ని రైళ్ల‌ను య‌ధావిధిగా న‌డుపుతున్న‌ట్లు చెప్పారు.. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రైల్వేశాఖ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయాలైన వారికి 2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement