Monday, May 6, 2024

ఆర్డీఎస్ వద్ద కూర్చుంటాన్న కేసీఆర్ ఎక్కడకు పోయారు?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం కేసిఆర్ కు చిత్తశుద్దిలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆర్డీఎస్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కు చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఆర్డీఎస్ నుంచి జగన్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని… అయినప్పటికీ కేసీఆర్ కు సోయి లేదని మండిపడ్డారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు కుడి కాలువను మూసివేయడానికి, పాత పాలమూరు జిల్లా ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని డీకే అరుణ అన్నారు. ఆర్డీఎస్ వద్ద కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పిన కేసీఆర్ ఎక్కడకు పోయారని ఎద్దేవా చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి, ఆయన ఎమ్మెల్యేలు కుడి కాలువ మీదుగా పడుకోవాలని, ఆర్డీఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా నీటిని మళ్లించడాన్ని ఆపాలని కోరారు. కరువు పీడిత రాయలసీమాను ఏపీని సంపన్న ప్రాంతంగా మారుస్తామని కెసిఆర్ గతంలో పేర్కొన్నట్లు గుర్తు చేశారు. ఏపీ అక్రమ నీటిపారుదల ప్రాజెక్టులతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాలను దెబ్బతీసినప్పటికీ ముఖ్యమంత్రి బాధపడటం లేదని ఆమె విమర్శించారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్రమంగా నీటిని మళ్లించినందుకు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తామని చెప్పారని, ఇప్పుడు వారు తమ మాటను నిలబెట్టుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. కృష్ణ నదిపై అక్రమ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం చేపట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆపలేకపోయిందని, ఈ సమస్యలపై బీజేపీని నిందిస్తున్నారని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ పాలనలో పాలమురు జిల్లా చాలా అన్యాయాలకు గురైందని అరుణ పేర్కొన్నారు.

ఇదీ కూడా చదవండి: టీటీడీ బోర్డు స్థానంలో స్పెసిఫైడ్‌ అథారిటీ ఏర్పాటు

Advertisement

తాజా వార్తలు

Advertisement