Saturday, April 27, 2024

TS | పెంబర్తి, చంద్లాపూర్​కు బెస్ట్ టూరిజం విలేజెస్ అవార్డుల ప్ర‌దానం..

జాతీయస్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు గ్రామాలు ఎంపికయ్యాయి. వాటిలో జనగామ జిల్లాకు చెందిన పెంబర్తితో పాటు సిద్ధిపేట జిల్లాకు చెందిన చంద్లాపూర్ ఉన్నాయి. బుధవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా.. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి విద్యావతి చేతుల మీదుగా ఈ అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలాజా రామయ్యర్, పెంబర్తి సర్పంచ్ అంబాల ఆంజనేయులు, సిద్దిపేట్ జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, చంద్లాపూర్ సర్పంచ్ సూరగోని చంద్రకళ అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement