Thursday, May 2, 2024

రాజీవ్ గృహకల్ప ఇండ్లు అలాట్మెంట్ చేయాలని ల‌బ్ధిదారుల ధ‌ర్నా..

రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు వెంటనే ఇల్లు అలాట్మెంట్ చేయాలని రామేశ్వరంబండలో ఇల్లు ఇస్తామని చెప్పినా జిల్లా అధికారుల హామీలను నిలబెట్టుకోవాలని స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రాజశ్రీ ను వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప సాధన కమిటీ జిల్లా కన్వీనర్ మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ.. సంగారెడ్డి పట్టణంలో 216 మంది వద్ద రాజీవ్ గృహకల్ప పేరుతో 49 వేల రూపాయలు కట్టించుకుని 12 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వెంటనే అలాట్మెంట్ లెటర్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటి అద్దెలు చెల్లించలేక సొంత ఇంటి కల నెరవేరాలంటే ఆశతో అప్పులు చేసి బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు కడితే ఎండిపోకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటని అన్నారు.

ఈ విషయమై జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వీరా రెడ్డి హౌసింగ్ మేనేజర్ శ్రీనివాస ప్రసాద్ రావు లబ్ధిదారులు రామేశ్వరం బండ లో ఉండడానికి ఒప్పుకుంటే వెంటనే ఇల్లు అలాట్మెంట్ చేస్తామని హామీ ఇవ్వడంతో.. రెండు దఫాలుగా లబ్దిదారులు అందరూ రామేశ్వరం బండ వెళ్లి ఇల్లు చూసిన తరువాత రాతపూర్వకంగా ఇరువురికి వినతి పత్రం తో పాటు సంబంధిత పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. మొదటి దఫా గా 66 మందికి అలాట్మెంట్ గా కలెక్టర్ సంతకంతో కూడిన లెటర్ ఇచ్చారని ఆయన అన్నారు. రెండో దశలో మరో 22 మంది దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఇస్తామని వారం రోజుల క్రితం మరోసారి కలవడానికి వెళితే ఇంతకంటే మించి ఇస్తామని చెప్పారు. దీంతో లబ్ధిదారులు 12 సంవత్సరాల నుంచి లేనివి ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. వెంటనే లబ్ధిదారుల అందరికీ రామేశ్వరం బండ లోనే ఇల్లు అలాట్మెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు

ఏ కార్యక్రమానికి సిపిఐ సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఎం ఏ రెహమాన్ మద్దతు తెలిపి మాట్లాడుతూ అధికారులు పూటకో మాట మాట్లాడితే సహించేది లేదని వెంటనే అర్హులైన లబ్ధిదారులకు అందరికీ ఇచ్చిన హామీ మేరకు ఇందుకు అలాట్మెంట్ చేయాలని సమస్య పరిష్కారం అయ్యేంతవరకు సిపిఐ సంగారెడ్డి జిల్లా సమితి రాజీవ్ గృహకల్ప సాధన కమిటీ చేసినటువంటి పోరాటం లో ప్రత్యక్షంగా పాల్గొంటుందని తెలిపారు. రాజీవ్ గృహకల్ప నిండు డబ్బా లాగా ఉంటాయని అల్లుడు ఎక్కడ ఉంటాడు కూడా ఉంటుంది అని చెప్పి డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి నా కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన ఉన్నటువంటి ఎర్రబెల్లి నరసన్నపేట రెండు గ్రామాలకు ఇచ్చి అందర్నీ మురిపిస్తున్న అని అన్నారు.

ఎన్ని సంవత్సరాల కాలంలో మిగతా చోట ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేని, కేసీఆర్ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని ఆయన విమర్శించారు. ఫామ్ హౌస్ కు ప్రగతి భవన్ కు పరిమితమైన అటువంటి ముఖ్యమంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి హరీష్ రావు కు ప్రజా సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు సంఘం కో కన్వీనర్లు టి రాజ్ కుమార్ మంగళ మహారాజ్ మంజుల నాగారం వాణి స్రవంతి మక్బుల్ బాల్రాజ్ అమరేశ్వరి విజయ రాము కైసర్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement