Sunday, April 28, 2024

Breaking: ఇవ్వాల 4 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌.. బండికి కౌంట‌ర్ అటాక్ ఉంటుందా?

నిన్న కేంద్రం ప్ర‌భుత్వం తీరుపై, బీజేపీ చీఫ్ బండి సంజ‌య్‌ఫై ఫైర్ అయిన సీఎం కేసీఆర్ ఈ రోజు మ‌ళ్లీ ప్రెస్ పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇవ్వాల బీజేపీ లీడ‌ర్ బండి సంజ‌య్ సీఎం మీడియా మీట్‌పై మాట్లాడిన నేప‌థ్యంలోనే ఈ ప్రెస్ ఉంటుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం కేసీఆర్ మాట‌ల‌న్నీ అబ‌ద్ధాలేన‌ని బండి సంజ‌య్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం డ‌బ్బులుచ్చిన త‌క్కువ చెబుతున్నార‌ని ఆరోపించారు. వ్యాట్ పెంచి త‌గ్గించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. అంతే కాకుండ ఆరైతుల‌ను మోసం చేస్తున్నార‌ని, వ‌రి వేయ‌కుండా అడ్డుకుంటున్నార‌ని బండి విమ‌ర్శించిన నేప‌థ్యంలో వీట‌న్నిటికీ కౌంట‌ర్ ఇచ్చేందుకు పెద్ద‌సారు ప్రెస్ మీట్ పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement