Monday, May 6, 2024

విషసర్పాలతో.. జాగ్రత్త

ప్రభ న్యూస్ : వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న ప్రస్తుత సమయంలో రైతులను విషసర్పాల బెడద బెంబేలెత్తిస్తోంది. వాతావరణం చల్లబడడంతో పాములు తమ ఆవాసాల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ప్రతి యేటా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు పాము కాట్లు అధికంగా నమోదవుతున్నాయి. రెండో పంట తర్వాత రైతులు పెద్దగా పొలాల వైపు వెళ్లరు. ఎండాకాలంలో ఖాళీగా ఉండే పంట పొలాలను విషర్పాలు ఆవాసం చేసుకుంటున్నాయి. రుతుపవనాల రాకతో రైతులు, రైతు కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే అప్రమత్తంగా లేని రైతులు, కూలీలు పాము కాటుకు బలై నిండు ప్రాణాలు కోల్పోతున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఇవి పాటిస్తే పాము కాటు నుంచి త్వరగా కోలుకోవచ్చని చెబుతున్నారు.

అన్ని పాములు ప్రమాదకరం కాదు..

అయితే పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. 15 శాతం పాములతోనే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా పాము కాట్లలలో 50 శాతం విషప్రభావం లేకుండా కేవలం గాయాలు మాత్రమే ఉంటాయి. అయితే పాము కాటు వేసిందనే భయంతో షాక్‌కు గురై చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ధాన్యం సంచులు, గడ్డివాములు, మొదలైనవి ఉండే చోట ఎలుకలు ఎక్కువగా తిరుగుతుంటాయి. చల్లదనం ఉండే చోటుకు కప్పలు కూడా చేరుకుంటాయి. వీటిని ఆహారంగా తినేందుకు పాములు వస్తుంటాయి. కావున ఇలాంటి స్థలాలలో తిరిగేటప్పుడు అక్కడున్న వస్తువుల కదలికలపై నిఘా ఉండాలి. కొన్ని స్థలాలలో కుప్పలుగా వేసిన కట్టెలు, పిడకల మధ్యలో విష సర్పాలు చేరుతుంటాయి. రాత్రిపూట పొలాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్చిలైట్లు ఉపయోగించాలి. రాత్రిపూట బయటకు వెళితే చెప్పులు తప్పనిసరిగా ధరించాలి. గోడల పక్కన మురుగునీరు, చెత్తాచెదారం, ముండ్ల పొదలు లేకుండా చూడాలి. గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వెళుతురు ఎప్పుడు ఉండేలా చూడాలి.

- Advertisement -

పాములు వాటి విష ప్రభావం..

నాగు పాము కాటేసిన 15 నిమిషాల్లోనే శరీరంలోకి విషం ఎక్కుతుంది. కట్ల పాము కాటు వేసిన క్షణాల్లోనే విషయం రక్తకణాలలో కలిసి పోతుంది. రక్తపెంజరి కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది. పాము కాటుకు గురైన బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాలి. జెర్రిపోతు పాము కాటేసిన విషప్రభావం ఉండదు. అయితే కాట్లు పడిన చోట చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లడం మంచింది. విషపూరిత పాములు కాటేసినట్లు గుర్తించిన వెంటనే నాటు వైద్యులను సంప్రదించకుండా సమీప ఆస్పత్రులకు వెళ్లాలి. పాము కరచిన చోటు పై భాగాన కింద భాగాన బ్యాండేజిని గట్టిగా కట్టాలి. పాము కాటుకు గురైన వారిని పరిగెతితంచడం వంటివి చెయ్యరాదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement