Thursday, May 16, 2024

బండిసంజ‌య్ అరెస్ట్ స‌రికాదు-తెలంగాణ‌లో నియంత పాల‌న‌- జీవిత‌

సీఎం కేసీఆర్ కుటుంబానికి కోట్లాది రూపాయ‌ల ఆస్తులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించారు ..సినీ న‌టి..బిజెపి నాయ‌కురాలు జీవిత‌. పబ్బులు, క్లబ్బుల్లో కేటీఆర్ కు వాటాలు ఉన్నాయని… ఈ విషయాన్ని తనకు చాలా మంది పబ్బులు, క్లబ్బుల యజమానులు చెప్పారన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని జీవిత మండిపడ్డారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం సరి కాదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే బండి సంజయ్ ను విడుదల చేసి, పాదయాత్రకు అనుమతించాలని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే పాదయాత్రలు చేయాలని సవాల్ విసిరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తప్పు చేయనప్పుడు… అసలు వాస్తవం ఏమిటో చెప్పాలని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన దీక్షలో జీవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement