Monday, April 29, 2024

దండుపాళ్యం బ్యాచ్ అంతా ఏక‌మై బిజెపిని ఓడించారు – బండి సంజయ్

క‌రీంనగ‌ర్ – క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్, జెడిఎస్, బిఆర్ ఎస్ లు దండుపాళ్యం బ్యాచ్ గా ఏర్ప‌డి బీజేపీని ఓడించాయని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్ అన్నారు. కర్ణాటకలో ఓడినా బీజేపీ ఓటు బ్యాంకు ఎక్కడా చెక్కు చెదరలేదని చెప్పారు. ఒక వర్గం ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తోందని అరోపించారు.. ర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం సాయంత్రం కరీంనగర్ లోని తన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో జరిగిన 5 ఉప ఎన్నికల్లో రెండింటిలో బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతయ్యాయని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందని అన్నారు..తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. కాగా, కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలో గెలవగానే ఇంతలా రెచ్చిపోతున్నారని అంటూ బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని గుర్తుంచుకోవాల‌ని బండి వ్యాఖ్యానించారు.. కర్ణాటకలో అన్ని పార్టీలు మత రాజకీయాలు చేశాయని విమర్శించిన బండి 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మత రాజకీయాలు చేసిందెవరని ప్రశ్నించారు . ఫక్తు మత రాజకీయాలు చేసింది కాంగ్రెస్సేనని విమర్శించారు. అయితే కర్ణాటక రాజకీయాలు తెలంగాణలో పనిచేయబోవన్నారు. ఇక జేడీఎస్ ఓటింగ్ షేర్ 20 నుంచి 13 కు తగ్గిందన్నారు . కర్నాట‌క‌లో కాంగ్రెస్ కు మద్దతిచ్చి కేసీఆర్ అక్కడ పెద్దన్న పాత్ర పోషించారని అరోపించారు..

కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు తగ్గలేదని, ఎన్నికల్లో మాదిరిగానే 36 శాతం ఓట్లు వచ్చాయ‌ని. సీట్లు మాత్రమే తగ్గాయన్నారు. అట్లాగే కాంగ్రెస్ కు గతంలో 38 శాతం ఓట్లు 80 సీట్లు వస్తే ఈసారి 43 శాతం ఓట్లతో 134 సీట్లు గెలుచుకుందన్నారు . మత రాజకీయాలు చేసిన పార్టీ కాంగ్రెస్సే. ఒక వర్గం ఓట్లన్నీ గంప గుత్తగా కాంగ్రెస్ కే పడేలా చేశారన్నారు. జెడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం స్వయంగా ఒక వర్గం ఓట్లు చీలితే బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేశార‌ని, ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడేలా చేశారని సంజయ్ అన్నారు. ఎంఐఎం పార్టీతోపాటు నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన ఎన్డీపీఐ పార్టీ సైతం కాంగ్రెస్ గెలుపుకు కృషి చేశాయన్నారు. బీజేపీని బూచిగా చూపి ఓట్లు దండుకున్న పార్టీ కాంగ్రెస్సే. హిందూ సమాజానికి వ్యతిరేకంగా, హేళన చేసే విధంగా కాంగ్రెస్ రాజకీయాలు చేసిందన్నారు.
2018 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింద‌ని,. ఎంపీ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచామ‌ని తెలిపారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసే పనిచేస్తాయని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మనుషులు కలిసే ఉన్నార‌ని,.. కర్నాటకలో మనసులు కూడా కలిశాయన్నారు.
కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి షాడో మిత్రుడని తెలంగాణలో కలిసే పనిచేయబోతున్నారని జోష్యం చెప్పారు.
.

Advertisement

తాజా వార్తలు

Advertisement