Sunday, May 5, 2024

Karnataka results | మన ‘బండి’ ప్రచారం అంటే ఇగో ఇట్లుంటది.. కర్నాటక ఫలితాలపై నెటిజన్ల సెటైర్లు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగం వింటే గూస్​బమ్స్​ వస్తాయి. యువత రెచ్చిపోయేలా బండి మాటలు మంత్రంలా పనిచేస్తాయి. విద్వేశాలను మరింత పెంచేలా ఆయన ప్రసంగం సాగుతుంది. అయితే.. ఇప్పుడు కర్నాటక ఎన్నికల వేళ పొరుగు రాష్ట్రం వెళ్లి ప్రచారం చేసిన తరుణంలో అక్కడ రిజల్ట్​ ఎట్లుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇవ్వాల (శనివారం) కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గమనిస్తే.. బండి ప్రచారం చేసిన ఆరు నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా బీజేపీ గెలవలేదన్నది స్పష్టమవుతోంది.
– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కర్నాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తెలంగాణ చీఫ్​ బండి సంజయ్​ కోలార్‌, చింతామణి, ముల్బగల్, గౌరీబిదనూర్‌, బాగేపల్లి, చిక్కబల్లాపూర్‌ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో వీధివీధి తిరుగుతూ ప్రధాని మోదీ గురించి, బీజేపీ గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ, బండి సంజయ్ ప్రచారాన్ని కన్నడ ప్రజలు నమ్మినట్టు లేరు. ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో బీజేపీకి చెంపపెట్టులాంటి తీర్పు వచ్చింది. బండి ప్రచారం చేసిన అన్ని చోట్లా కాషాయ పార్టీ దారుణంగా ఓడిపోయింది.

అప్పటిదాకా గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్న ప్లేసుల్లో గెలవడం అటుంచితే కనీసం రెండో స్థానంలో కూడా బీజేపీ పోరాటం చూపలేకపోయింది. బండి ప్రచారం చేసిన కోలార్‌, చింతామణి, ముల్బగల్‌ స్థానాల్లో బీజేపీ మూడో స్థానానికి పడిపోయింది. గౌరీబిదనూర్‌లో అయితే ఏకంగా ఐదో స్థానానికి దిగజారింది. బాగేపల్లి, చిక్కబల్లాపూర్‌లో కూడా బీజేపీ ఓటమి పాలైంది. బండి ప్రచారం చేస్తే ఇగో ఇట్లుంటది.. అంటూ ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో తెగ వైరల్​ చేస్తున్నారు. బండి సంజయ్‌ ప్రచారం అంటే అట్లుంటది అని నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement