Tuesday, April 30, 2024

కర్తవ్యపథ్ వ‌ద్ద స్పై టీజ‌ర్ రిలీజ్

నిఖిల్‌ నటిస్తున్న థ్రిల్లర్‌ సినిమా స్పై. ‘తుమ్‌ ముజే ఖూన్‌ దో, మై తువ్హుె ఆజాదీ దూంగా’ (మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను) అని నినదించిన సుభాష్‌ చంద్రబోస్‌ రహస్యాల ఆధారంగా రూపొందించబడిన చిత్రమని చిత్రబృందం ఇటీ-వల విడుదల చేసిన వీడియో ద్వారా సూచించారు.
ఈ సినిమా టీజర్‌ను ఢిల్లీలో మే 15న కర్తవ్యపథ్‌ (రాజ్‌పాత్‌)లో సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద విడుదల చేయనున్నారు.
ప్రముఖ ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని కె రాజశేఖర్‌ రెడ్డి, సి ఇ ఓ గా చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి నిర్మించారు.
నిఖిల్‌ సరసన ఐశ్వర్య మీనన్‌ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్‌ ముఖ్యపాత్రధారిణి. ఆర్యన్‌ రాజేష్‌  ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్‌ రెడ్డి కథను అందించారు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో జూన్‌ 29న విడుదల చేస్తారు.
నిఖిల్‌ సిద్ధార్థ్‌, ఆర్యన్‌ రాజేష్‌, ఐశ్వర్య మీనన్‌, సన్యా ఠాకూర్‌, అభినవ్‌ గోమఠం, మకరంద్‌ దేశ్‌పాండే, జిషు సేన్‌ గుప్తా, నితిన్‌ మెహతా, రవివర్మ, కృష్ణ తేజ, ప్రిషా సింగ్‌, సోనియా నరేష్‌ ఇతరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement