Wednesday, May 1, 2024

Ayodya Temple – 22న ప్రతి ఇంటిలో రామ జ్యోతులు వెలిగించాలి – ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, జనవరి (ప్రభ న్యూస్)16: అయోధ్య రామ మందిర పునః ప్రతిస్థాపన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22 న ప్రతి ఇంటి లో రామ జ్యోతులు వెలిగించాలని, రాముల వారి సేవలో పాల్గొని తరిద్దామని అర్బన్ ఎమ్మెల్యే, శ్రీ రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ కో కన్వీనర్ ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్ లోని బిజెపి జిల్లా పార్టీ కార్యాల యం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ఈనెల 22 న ప్రతి ఇంట్లో దీపావళి అయోధ్య పండుగ జరుపుకోవాలనీ పిలుపునిచ్చారు. అయోధ్య రామ మందిర పునః ప్రతిస్థా పన కార్యక్రమంలో బాగంగా ఈ నెల18 న ఖిల్లా రామా లయం లో శుద్ది కార్యక్రమం నిర్వహిం చనున్నట్లు తెలిపారు. 20న నగరంలోని అన్ని పురాతన ఆలయంలో శుద్ది కార్యక్రమం నిర్వహించబడుతుందని అన్నా రు.22 న ఉదయం 6 గంటల నుంచి ఖిల్లా రామాలయం లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాములవారికి అభిషేకం, హోమం, సీతారాములా కళ్యా ణం అన్నదానం కార్యక్రమం చేపడుతారని తెలిపారు.

అదే విధంగా ఖిల్లా రామాలయం వద్ద అయోధ్య రామ మందిర నుంచి ప్రసారం అయ్యే పునః ప్రతిష్ట కార్యక్రమం విక్షించ డా నికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తు న్నా మని తెలిపారు. అదే రోజు సాయంకాలం శంబుని గుడి చుట్టూ 1500 మంది మహిళా సోదరి మణులతో దీపారాధన కార్యక్రమం నిర్వహి స్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో ఇందూరు నగర ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమా లను విజయవంతం చేసి రాముల వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ,మాస్టర్ శంకర్, జిల్లా sc మోర్చా అధ్యక్షులు శివ ప్రసాద్, నారాయణ యా దవ్, బద్దం కిషన్, గిరిబా బు,రోషన్ లాల్ బోర,పుట్ట వీరేం దర్,మఠం పవన్, చింతకాయల రాజు,చిరంజీవి,బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement