Sunday, April 28, 2024

Audio Released – కేసీఆర్ ను మూడవసారి ముఖ్యమంత్రిని చేద్దాం..ఎన్నికల పాటను విడుదల చేసిన మంత్రి హరీష్

గజ్వేల్ అక్టోబర్ 17 (ప్రభ న్యూస్) రైతుబంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, కొండపాక వైస్ ఎంపీపీ దేవి రవీందర్,మర్కుక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి లు రూపొందించిన 2023 ఎన్నికల పాటల సీడీని మంగళవారం సిద్దిపేట లో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో కేసిఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించడం కోసం అందరూ కలిసికట్టుగా ఉండి కృషి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తెలపాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్ రావు, ములుగు ఆత్మ కమిటీ డైరెక్టర్ యావగారి సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement