Sunday, February 18, 2024

TS: సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన కామారెడ్డి ఎస్పీ

కామారెడ్డి, అక్టోబర్ 17 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి మద్యం, నగదు, ఇతర నిషేధిత పదార్థాలు, వస్తువులు కామారెడ్డి జిల్లాలోనికి రాకుండా చూసేందుకు మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాబత్పూర్ వద్ద, జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోపూర్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.

24/7 అన్ని వాహనాలను పూర్తిగా, క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ సిహెచ్.సింధు శర్మ తెలిపారు. మంగళవారం రెండు చెక్ పోస్టులను తనిఖీ చేసి అక్కడున్న అధికారులకు తగు సూచనలు, సలహాలు చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement