Wednesday, October 9, 2024

TS | జక్రాన్ పల్లిలో యువతిపై దాడి.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీపీ​

నిజామాబాద్ సిటీ (ప్రభ న్యూస్): నిజామాబాద్​ జిల్లా జక్రాల్ పల్లి లో జరిగిన ఘటన పై విచారణ చేపట్టి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోయువకుడి దాడిలో తీవ్రంగా గాయపడి జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజశ్రీని సీపీ పరామర్శిం చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారి కుటుంబానికి భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఎస్.సి, ఎస్.టి, హత్యా యత్నం కేసు నమోదు చేశామనీ తెలిపారు. నిందితుడిని అదుపులో తీసుకునేందుకు రెండు స్పెషల్​ టీములతో ముమ్మరంగా దర్యా ప్తు చేస్తున్నామన్నారు. ఫాస్టు ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటిలే టర్ పై చికిత్స పొందుతున్న అమ్మాయికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement