Monday, May 20, 2024

కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం : ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, (ప్రభ న్యూస్): కేంద్రంలో ఉన్నది ప్రజావ్యతిరేక ప్రభుత్వం, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రభుత్వమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వరి ధ్యానం పండించిన రైతులకు అన్యాయం చేస్తోందని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరిధాన్యం కొనుగోలు చేయాలన్నారు. పంజాబ్ రైతులు పండించిన ధాన్య కొనుగోలు చేస్తోంది, కానీ తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం మాత్రం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర రైతులను, ప్రభుత్వాని ఆర్ధికంగా దెబ్బతియాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. యాసంగి పంట కొనుగోలు చేయమని కేంద్ర మంత్రి చేపట్టమేమిటని మండిపడ్డారు.

పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవ‌డం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆవలభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామగ్రామాన ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈనెల 20న రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమరంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఊరూర తెలియజేస్తాన‌న్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఎఫ్సీఐ గోదాముల నిర్మించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనటం లేదు.. అందుకే రైతులు యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సారించాలని తెలిపారు. రైతులు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఆరుతడి పంటలు పండించాలని కోరారు. ఈ మహా సమరంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రైతులు, రైతు సమన్వ సమితి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేయాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement