Tuesday, May 14, 2024

ఓరుగల్లుకు మరో రాష్ట్ర స్థాయి పదవి.. నాట‌క అకాడ‌మీ చైర్‌ప‌ర్స‌న్‌గా దీపికారెడ్డి నియామకం

ప్రముఖ నృత్య కళాకారిణి దీపికారెడ్డిని రాష్ట్ర సంగీత నాటక అకాడ‌మీ చైర్ పర్సన్ గా నియామ‌క‌మ‌య్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నృత్య కళాకారిణి దీపికారెడ్డికి ఈ అవ‌కాశం క‌ల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రగతి భవన్ లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి చైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, చైర్ పర్సన్ గా నియమకమైన దీపికారెడ్డి తో కలిసి సీఎం కెసిఆర్ ని కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement