Thursday, May 2, 2024

NZB: బాన్సువాడ మాతా-శిశు ఆస్పత్రికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు.. పోచారం

బాన్సువాడ మాతా-శిశు ఆస్పత్రికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు వచ్చిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా అత్యుత్తమ మాతృత్వ వైద్య సేవల విభాగంలో బాన్సువాడకు రెండవసారి లక్ష్య అక్రిడేషన్ లభించింది. ఈసందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో మాతా-శిశు ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ జాతీయ స్థాయి లక్ష్య గుర్తింపు మూడు సంవత్సరాలు. ఈ గుర్తింపు పొందిన ఆసుపత్రికి ప్రతి ఏడాది ఆరు లక్షల రూపాయలు పారితోషకంగా అందిస్తారు. జాతీయ స్థాయి బృందం బాన్సువాడ MCH ని పరిశీలించి, మెటర్నిటి సేవలపై సంతృప్తి చెంది వరుసగా రెండవ సారి లక్ష్య గుర్తింపు.

వరుసగా రెండోసారి బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి లక్ష్య గుర్తింపు రావడం పట్ల సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రైతులను, సిబ్బందిని సభాపతి అభినందించారు. జిల్లాలో అత్యధికంగా బాన్సువాడ MCH లో నెలకు 450కి పైగా డెలివరీలు చేశారు. ఇప్పటికే బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి నేషనల్ క్వాలిటీ అస్యురెన్స్ స్టాండర్డ్ గుర్తింపుతో పాటుగా తల్లిపాల ప్రోత్సాహంలో జాతీయ అవార్డు సాదించిన ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవలను అందించాలని సభాపతి కోరారు. సూపరింటెండెంట్ డా.శ్రీనివాస ప్రసాద్, డా.సుద, డా.విజయ భాస్కర్, సిబ్బంది స్పీకర్ ను కలిసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement