Saturday, May 4, 2024

NLG: సేవాలాల్ మహారాజ్ ఆలయానికి విరాళం ఇవ్వడం సంతోషకరం.. కిషన్ నాయక్

దేవరకొండ, జులై 31, (ప్రభన్యూస్) : శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా విరాళం ఇచ్చే అదృష్టం రావడం సంతోషంగా భావిస్తున్నానని ఆదివాసి కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్ అన్నారు. సోమవారం దేవరకొండ బంజారా భవన్ లో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి 6,66,666 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గిరిజనుల ఆరాధ్య దైవం, హిందూ భావజాలాన్ని గిరిజనులకు తెలియపరిచిన మహోన్నతమైన దైవం అని అన్నారు. ఆలయాల నిర్మాణానికి తన వంతు సహాయం ఎల్లవేళలా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గం బంజారా సంఘం అధ్యక్షుడు కేతావత్ లక్ష్మణ్ నాయక్, కొర్ర పాండునాయక్, వాన్ కూడావత్ పాపా నాయక్, గోపాల్ నాయక్, చందర్ సింగ్, పంతులాల్ నాయక్, కేతావత్ శ్రీధర్, జైపాల్ నాయక్, సంతోష్ నాయక్, వెంకటేశ్వర్లు, చిత్రం రమేష్, రాజా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం పార్వతమ్మకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం..

- Advertisement -

దేవరకొండ మండల పరిధిలోని కర్ణాటిపల్లికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు చిత్రం రమేష్ తల్లి పార్వతమ్మ అనారోగ్యంతో గత కొంతకాలంగా హైదరాబాదులో చికిత్స పొంది తిరిగి ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న నేనావత్ కిషన్ నాయక్ పార్వతమ్మను పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్, అంగోతు రమేష్, సంతోష్ నాయక్, కేతావత్ శ్రీధర్ సింగ్, జైపాల్ నాయక్, చిత్రం మహేష్, శివ రావుల, మనోహర్ గౌడ్, ఎండి కాజా, లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement