Thursday, November 14, 2024

బైకుని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని బుధవారం ఉదయం ఇద్దరు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంథని మండలం ఖాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల కుమార స్వామి (48), పెరల విమల (40) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వీరిని ఢీ కొట్టింది. దీంతో వీరు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు.

కుమారస్వామి, విమల వేర్వేరు పనులపై హైదరాబాద్ వెళ్లి తమ గ్రామానికి వెళ్తుండగా కాటారం వెళ్లే దారిలో గాడుదుల గండి సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికి అక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement