Thursday, March 28, 2024

ధర్మం – మర్మం :

గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా గౌతమకృత శివస్తుతి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

గౌతమ మహర్షి శంకరుడిని స్తుతిస్తూ నీవు ధర్మమును స్థాపించుటకు, బుక్‌, యజు, సామ, అధర్వణములుగా వేదములను విభజించి ఆ వేదములకు వ్యాఖ్యాన రూపములుగా స్మృతి, ఇతిహాస పురాణములుగా, గాధలుగా అవతరించిన నీవు శబ్ధ రూపమును ధరించి ఉన్నావని పలికెను. యజ్ఞము, యజ్ఞ సాధనములు, ఋత్విక్‌ స్వరూపము, యజ్ఞ ఫలము, యజ్ఞదేశము, యజ్ఞకాలము, యజ్ఞము యొక్క పరమాత్మ తత్త్వము అన్నీ నీవే కావున యజ్ఞాంగ శరీరుడుగా స్తోత్రము చేసెదరు. కర్తవు, దాతవు, దానస్థానము, దానము, సర్వజ్ఞుడవు, సాక్షివి, పరమ పురుషుడవు, ప్రత్యగాత్మవు, పరమార్థ స్వరూపము అన్నీ నీవేనంటూ వేదములతో, శాస్త్రములతో, నిర్దేశించబడవని, బుద్ధి, అంత:కరణము, చిత్తములతో తాకబడవు, పుట్టుక లేనివాడవు, కొలత లేనివాడవు, శివ అను శబ్ధమునకు అర్థము, సత్యము అయిన నీకు ప్రణామములు అని గౌతముడు శంకరుడిని స్తుతించెను.

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement