Saturday, May 4, 2024

కెసిఆర్ తో అమిత్ జోగి భేటి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఛత్తీస్‌గ్‌ఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగీ తనయుడు, ఆ రాష్ట్ర జనతా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అమిత్‌ జోగి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుతో సమావేశమయ్యారు. పార్టీ ముఖ్యనాయకులతో కలిసి ప్రగతి భవన్‌కు వచ్చిన ఆయన జాతీయ రాజకీయాలు, బీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యాలు, ఉద్దేశాలపై సీఎం కేసీ ఆర్‌తో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా, తెలంగాణ అభివృద్ధి, దేశంలో నెలకొంటున్న తాజా రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహా రాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీ విధివిధానాల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపిన అమిత్‌ జోగి, అధినేత సీఎం కేసీఆర్‌ను అడిగి మరిన్ని విషయాలు, ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టో తదితర అంశాలను గురించి తెలుసు కున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తుల అవసరం వున్నదని ఈ సందర్భంగా జోగి అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా విస్తరించడాన్ని ఆయన ఆహ్వానించారు. అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్ర పాలనను దేశానికి ఆదర్శంగా నిలిపారని ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరసలో తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని అభినందించారు. తన తండ్రి, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌ జోగీ తన గురించి రాసుకున్న ఆటోబయోగ్రఫీ (ఆత్మకథ) పుస్తకాన్ని ఈ సంద ర్భంగా కేసీఆర్‌కు బహూకరించారు. కాగా, జనతా కాంగ్రెస్‌ పార్టీకి ముగ్గురు ఎమ్మె ల్యేలున్నారనీ, ఆ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అండతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, అదే సమయంలో దేశ రాజకీ యాల్లో కీలక భూమిక పోషిస్తున్న కేసీఆర్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుం దని అమిత్‌ జోగి భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement