Friday, May 3, 2024

నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై అవగాహన రహిత ఆరోపణలు సరికాదు.. గండ్రత్ ఈశ్వర్

నిర్మల్ ప్రతినిధి, ఆగస్టు 17 (ప్రభ న్యూస్) : నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై అవగాహన రహిత ఆరోపణలు చేయడం సరికాదని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. గురువారం పురపాలక సంఘం కార్యాలయం చైర్మన్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ… 220 జీవో ప్రకారం మాస్టర్ ప్లాన్ ఆమోదించారని చేస్తున్న ఆరోపణలు ఆధారాలతో రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఆధారాలతో రుజువు చేయనియెడల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటావా అని సవాల్ విసిరారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష చేయటం ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అని అన్నారు.
మాస్టర్ ప్లాన్ ప్రకీయ పూర్తయిపోయిందని రైతులకు, ప్రజానీకానికి నష్టం జరుగుతుందని ప్రజలందరినీ అసత్య ప్రచారాలతో మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు.


నిర్మల్ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ప్రకీయ ఇంకా పూర్తి కాలేదని, రైతులు, ప్రజల నుండి వచ్చిన ప్రతిపాదనలు అన్ని పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్తున్నామన్నారు. ఇలాంటి మోసపూరిత మాటలు ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యిందని ఆరోపణలు చేయడం కాదు, పక్కా ఆధారాలతో నిరూపించు.. ప్రజల మధ్యలో తాను తన పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఒకవేళ ఆధారాలతో నిరూపించని యెడల మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకోవాలని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ సవాల్ విసిరారు. మంజులపూర్, తల్వద ప్రాతం ఇండ్రస్టియల్ జోన్ లో పడింది, రైతులకు, ప్రజానీకానికి నష్టం కలగకుండా కమర్షియల్, రెసిడెన్షియల్ లో మారుస్తున్నామన్నారు.

అదేవిధంగా తలెవెద, విశ్వనాథ్ పేట్ 200 ఫిట్ రోడ్, బంగల్ పేట్ 100 ఫిట్ రోడ్డు ను మార్పు చేస్తున్నామన్నారు. మహేశ్వర్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి తను రాజకీయంగా లబ్ది కోసం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మల్ ఎమ్మెల్యే గా నువ్ ఉన్న పీరియడ్ లో మాస్టర్ ప్లాన్ మార్చే అవకాశం ఉన్నా గాలికి వదిలేసి, ప్రస్తుతం నిర్మల్ ప్రజల మేలు కోసం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాబోయే రోజుల్లో నీకు ఓటవి తప్పదని భావించి చీటికి మాటికి మంత్రి ప్రజలని మోసం చేసారని, అవినీతికి పాల్పడ్డారాని విమర్శించటం సరికాదన్నారు. మంత్రిపై అబండాలు మోపి ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

- Advertisement -


నిర్మల్ జిల్లా సాధకుడు, సమీకృత కలెక్టరేట్, మెడికల్ కళాశాల, జిల్లా ప్రధాన ఆసుపత్రి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో ఉన్న ప్రజా నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక రాబోయేది ఎన్నికల సమయం కావటంతో దిగజారుడు తనంతో మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయని, ప్రజలందరి ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్, నిర్మల్ ఎమ్మెల్యే గా మళ్ళీ ఇంద్రకరణ్ రెడ్డి గెలిచి, మంత్రి గా కొనసాగుతారన్నారు. సమావేశంలో కౌన్సిలర్స్ లక్కాకుల నరహరి, గండ్రత్ రమణ, అబ్దుల్ మతిన్, బిట్లింగ్ నవీన్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement