Saturday, October 12, 2024

వినాయక విగ్రహ నిర్మాణ ప్రారంభ పూజ చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

కాచిగూడ యంగ్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల కోసం వినాయక విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభ పూజ చేశారు. కాచిగూడ యంగ్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వినాయక నవరాత్రుల ఉత్సవాల కోసం ఏర్పాటు చేసే గణేష్ విగ్రహ నిర్మాణ పనుల ప్రారంభానికి, ఈరోజు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ ఉమ రమేష్ యాదవ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ పూజ చేయడం తన ఆదృష్టంగా భావిస్తున్నానని, 45 సంవత్సరాలుగా ఈ శుభ కార్యక్రమాన్ని ఎంతో శోభాయమానంగా నిర్వహిస్తున్న సాయిబాబాని, వారి బృందం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement