Wednesday, May 1, 2024

ఇక్క‌డ టీఎస్‌పీఎస్‌సీ ప‌రీక్షా ప్ర‌శ్నాప‌త్రాలు ల‌భించును….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వద్ద వివాదాస్పద వాల్‌పోస్టర్లు వెలిశాయి. ”టీఎస్‌పీఎస్‌సీ ఓ జీరాక్స్‌ సెంటర్‌” అంటూ గోడపై పోస్టర్లు అం టించడం కలకలం రేపాయి. ఇచ్చట అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రములు లభించును అంటూ అందులో రాశారు. తప్పు చేసిన కమిషన్‌ బోర్డును రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు. ఓయూ జేఏసీ సభ్యుల పేరుతో పలు డిమాండ్లతో పోస్టర్లను అతికిం చారు. ‘ఇది ఉద్యోగ నియామక కార్యా లయం కాదు.. జీరాక్స్‌ సెంటర్‌’ అని వాల్‌ పోస్టర్లలో వెల్లడించారు. ”ముఖ్య మంత్రి మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. ప్రశ్నపత్రాల లీకేజీలో మీ కుటుంబ సభ్యుల పాత్రలేదని చెప్పడానికి వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలి. టీఎస్‌పీఎస్‌సీ బోర్డును, సంబంధిత శాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలి. నష్టపోయిన విద్యార్థులకు ఈ నెల నుంచి ప్రతి నెలకు రూ.10 వేల చొప్పున మళ్లి పరీక్ష నిర్వహించే వరకూ ప్రభుత్వం పరిహారం చెల్లించాలి” అని పోస్టర్‌లో వెల్లడించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు, వివిధ విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో సిట్‌ దూకుడు పెంచింది. దీంతో ఈ లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఇదిలా ఉండగానే తాజాగా టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద టీఎస్‌పీఎస్‌సీ జీరాక్స్‌ సెంటర్‌ అంటూ వాల్‌ పోస్టర్లు వెలువడడం కలకలం రేపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement